Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అర్జున్ వల్లనే నాకు అవకాశాలు రావడం లేదు: హీరోయిన్ శ్రుతి హరిహరన్

  • నిర్మాతలెవరూ నన్ను సంప్రదించడం లేదు 
  • అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి 
  • నా కెరియర్ నాశనమైపోయింది   
తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో అర్జున్ సార్జాకి మంచి క్రేజ్ వుంది. అలాంటి అర్జున్ ఒక సినిమా షూటింగు సమయంలో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేశారు. ఆ వెంటనే ఈ ఆరోపణలను అర్జున్ ఖండించారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అయితే తాజాగా మరోసారి శ్రుతి హరిహరన్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు.

"అర్జున్ పై ఆరోపణలు చేసిన తరువాత నాకు ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. గతంలో వారానికి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కొత్త ప్రాజెక్టుల కోసం నన్ను సంప్రదించేవారు. అలాంటిది అర్జున్ పై ఆరోపణలు చేసిన దగ్గర నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు .. నా కెరియర్ నాశనమైపోయింది. సౌత్ లో అర్జున్ కి ఎంతో పలుకుబడి వుంది. ఆ పలుకుబడిని ఉపయోగించి ఆయన నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
sruthi hariharan

More Telugu News